Header Banner

భారతీయులకు ట్రంప్ మరో ఎదురుదెబ్బ.. వారికి భారీ షాక్.. ఇక వీసా రానట్లే.! రిజిస్ట్రేషన్ తప్పనిసరి - లేదంటే భారీ జరిమానాలు, జైలు శిక్ష!

  Tue Apr 15, 2025 15:42        U S A

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చే షాకులకు అటు ప్రపంచ దేశాలు, ఇటు వలసవాదులు అల్లకల్లోలం అవుతున్నాయి. గ్యాప్ ఇవ్వకుండా ట్రంప్ తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు అమెరికా వెళ్లాలన్న ప్రపంచ దేశాల యువతకు నిద్ర పట్టకుండా చేస్తున్నాయి. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు ట్రంప్. అమెరికాలో హెచ్-1బీ వీసా, గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న లక్షలమంది ఆశలపై ట్రంప్ నీళ్లు చల్లారు. వారికి భారీ షాక్ ఇచ్చారు. EB-5 అన్ రిజర్వ్ డ్ విభాగంలోని భారత అప్లికెంట్లకు అర్హత సమయాన్ని ఆరు నెలలకు కుదిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. చైనా దేశస్థులకు మాత్రం కటాఫ్ డేట్ మార్చలేదు అమెరికా యంత్రాంగం. కానీ భారతీయులకు మాత్రం 2019 నవంబరు 1 నుంచి 2019 మే 1కి కుదించింది. ఈ నిర్ణయంతో భారతీయులపైనే కక్ష కట్టినట్లుగా వ్యవహరించింది అమెరికా యంత్రాంగం. ట్రంప్ తాజాగా తీసుకున్న నిర్ణయంతో గ్రీన్ కార్డు లేదా హెచ్-1బీ వీసాకు అప్లై చేసుకునేవారికి అది లభించే అవకాశం మరింత సన్నగిల్లనుంది.

 

ఇది కూడా చదవండి: భారతీయులకు మరో షాక్.. ట్రంప్ కీలక నిర్ణయం - అమెరికా సంబంధం అంత ఈజీ కాదు.! ఇకపై వారికి కష్టాలే..

 

ఇటీవలే అమెరికాలో ఎక్కడికి వెళ్ళినా ఐడీ కార్డులు వెంట పెట్టుకోవాల్సిందేనని కొత్త యుఎస్ ఇమిగ్రేషన్ రూల్ తీసుకొచ్చింది ట్రంప్ సర్కార్. ఈ రూల్ ప్రకారం.. యూఎస్ లో నివసిస్తున్న విదేశీయులు తప్పనిసరిగా తమ వెంట ఐడి కార్డులు ఉంచుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. స్టడీ వీసా, ట్రావెల్ కి సంబంధించిన డాక్యుమెంట్లు, ఒకవేళ హెచ్1 బీ వీసా దారులు అయితే హెచ్1 బీ వీసా, గ్రీన్ కార్డు సహా వివిధ కేటగిరీల వీసాలు ఉన్నవారు ఎవరైనా సరే వారితోపాటు నిరంతరం వారి గుర్తింపు కార్డులు కూడా వెంట పెట్టుకోవాలని అధికారులు సూచించారు. మరోవైపు అమెరికాలో 30 రోజులకు పైగా ఉన్నవారు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని.. నమోదు చేసుకోని వారికి కఠిన శిక్షలు పడతాయని స్పష్టం చేసింది. అమెరికాలో 30 రోజులకు పైగా ఉన్న విదేశీయులకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసింది. తాజాగా ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధన ప్రకారం.. ఏప్రిల్ 11 తర్వాత అమెరికాకు వచ్చే విదేశీయులు 30 రోజుల్లోపు వేలిముద్రలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. లేదంటే భారీ జరిమానాలు, జైలు శిక్ష కూడా ఉంటుందని హెచ్చరికలు జారీ చేసింది.

ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. కొత్తగా నేషనల్ హైవే.. ఈ రూట్లో ఆరులైన్లుగా - భూముల ధరలకు రెక్కలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

తిరుమలలో భక్తులకు వసతి, కౌంటర్.. టీటీడీ కీలక నిర్ణయం! ఇక బస్సుల్లోనే..!

 

నేడు చంద్రబాబు అధ్యక్షతన ఏపీ క్యాబినేట్ కీలక సమావేశం.. పలు కీలక అంశాలపై చర్చ!

 

ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్ గా మళ్లీ ఆయనే ఫిక్స్! వీవీఎస్ లక్ష్మణ్‌కు కూడా..!

 

ఆ కీలక ప్రాజెక్టుకు గ్రీన్‌సిగ్నల్! టెండర్లు మళ్లీ ప్రారంభం!

 

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ బిగ్ అలెర్ట్.. రాష్ట్రంలోని 98 మండలాల్లో నేడు వడగాల్పులు, వానలు - ఎక్కడెక్కడంటే?

 

సీఆర్‌డీఏ కీలక ప్రతిపాదన! వేల ఎకరాల భూమి సమీకరణ! అవి మళ్లీ ప్రారంభం!

 

వైసీపీకి మరో బిగ్ షాక్! కీలక నేత రాజీనామా! జనసేన పార్టీ లోకి చేరిక?

 

వైసీపీకి భారీ షాక్.. రాజకీయాల్లోకి ఏబీ వెంకటేశ్వరరావు.. జగన్ అక్రమాలన్నీ బయటకు తెస్తా..

 

వారందరికీ పండుగ లాంటి వార్త.. ఆ జిల్లా చుట్టూ పెరగనున్న భూముల ధరలు! ప్రభుత్వం సంచలన నిర్ణయం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #USA #H1BVisa #India #Students #USANews #Government #Update #H1B